Social 1080×1350 • Multi-page
22-10-2024 BREAKING NEWS 04:22 AM
swarnodayam.com
Telugu Daily News

ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తో బీసీలకు అన్యాయం..జీవో నెంబర్ 29 రద్దు చేయాలి. – బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.

ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తో బీసీలకు అన్యాయం..జీవో నెంబర్ 29 రద్దు చేయాలి. – బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
IMG-20241022-WA0075

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తో అడుగడుగున బీసీలకు అన్యాయాలు జరుగుతున్నాయని, అగ్రకులాల జనాబే లెక్కలు లేనప్పుడు, అగ్రకులాల్లో ఉన్న పేదలను ఏ విధంగా గుర్తిస్తారని ఐదు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కట్టబట్టడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణలో జరుగుతున్న ప్రతి రిక్రూట్మెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో అన్యాయం గారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 29 రద్దు చేయాలని గ్రూప్ వన్ నియామకాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని అన్నారు. బీసీలు మునుపటిలా లేరని సంపూర్ణ చైతన్యంతో ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తామని బీసీలకు అన్యాయాలు జరుగుతే ఉపేక్షించేది లేదని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుమ్మక్కై బీసీలకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. వెంటనే ఆ చర్యలు మానుకోవాలని కోరారు. బీసీలు సంఘటిత శక్తిగా పోరాటం చేయాలని పిలిపనిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి ఆజాది యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, నాయకులు పంజాల రేవంత్, కూరపాటి రామచంద్రం, సాగర్, రుతిక్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!