Telugu Daily News
PDSU అర్థ శతాబ్ద వారోత్సవాల సభ విజయవంతం చేయాలి..PDSU కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే PDSU అర్థ శతాబ్ద వారోత్సవాల సభ విజయవంతం చేయాలని PDSU కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ తెలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో PDSU కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణా ప్రతాప్ హాజరై విద్యార్థులతో మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడే పిడిఎస్యు ను ఆదరించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.


