Social 1080×1350 • Multi-page
23-10-2024 BREAKING NEWS 12:27 AM
swarnodayam.com
Telugu Daily News

స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ డే వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ డే వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ డే 27వ తేదీన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం సత్య అర్జున గార్డెన్లో జరగబోయే సభకు సంబంధించిన వాల్పోస్టర్లను బుధవారం రాష్ట్ర కో – కన్వీనర్ గడప రాజు స్వేరో ఆధ్వర్యంలో హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నారన్నారు. అక్షరం ఆరోగ్యం ఆర్థికం వైపు రేపటి తరాలు అక్షరసూర్యులై ఆరోగ్య ప్రదాతలై ఆర్థికవేత్తలై ముందుకు సాగాలనే లక్ష్యంతో భారీ ఎత్తున స్వేరోలంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి రాష్ట్ర నలుమూలల నుండి స్వేరోమిత్రులు, విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ సభకు వచ్చి పెద్ద ఎత్తున విజయవంతంగా జరపడానికి అందరూ కలిసి రావాలని వాల్ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులందరికీ స్వేరోల తరపున పిలుపునిచ్చారు. అలాగే సీనియర్ నాయకులు గొర్రె చిరంజీవి అక్షరం ఆరోగ్యం ఆర్థికం వైపు బహుజన సమాజం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వేరో నాయకులతో పాటు వాకర్ సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!