Social 1080×1350 • Multi-page
24-10-2024 BREAKING NEWS 06:51 AM
swarnodayam.com
Telugu Daily News

సమస్యల సాధనలో ముందుంటా..! -పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు

సమస్యల సాధనలో ముందుంటా..! -పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు
IMG_20241024_174804

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట:
నిరుద్యోగుల ఉద్యోగుల పట్టపద్రుల ఉన్న సమస్యల సాధనలో తనను గెలిపిస్తే ముందు ఉంటానని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టపద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని కాకతీయ, లోటస్ పాండ్, జిఎస్ ఆర్, గౌతమి పాఠశాలలో ఆయన పట్టభద్రులతో కలిసిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ….నియోజకవర్గంలోని పట్టభద్రులంతా నవంబర్ ఆరవ తేదీలోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. నాలుగు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 22 సంవత్సరాలుగా తస్మా సంస్థ ఫౌండర్ సభ్యుడిగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడంలో ముందున్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కరోనా సమయంలో నెలకు 25 కిలోల సన్నబియ్యం 2000 రూపాయలు అప్పుడున్న ప్రభుత్వ పెద్దలను ఒప్పించి రాష్ట్రంలోని 1,82,000 మంది ప్రవేటు ఉపాధ్యాయులకు అందించేలా కృషి చేశానని అన్నారు. ఇంతే కాకుండా ప్రభుత్వం వసూలు చేస్తున్న విద్యా సెస్సు ఇప్పటి వరకే కేంద్ర ప్రభుత్వ వద్ద కోట్లాది రూపాయలు వృధాగా ఉందని, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు 10 లక్షల బీమా కోసం, పదిలక్షల ఆరోగ్య సంరక్షణ కోసం ఆ నిధులను ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయుల తరఫున మాట్లాడే గళంగా ఉండడానికి తాను ముందుకు వచ్చానని అన్నారు. నిరుద్యోగులకు కూడా అనేక వాగ్దానాలు చేసిన ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో మరిచిపోతున్నాయని పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ప్రభుత్వం నుండి వాటిని వచ్చేలా ఒత్తిడి తీసుకొని వస్తానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పైన వారి ఎమ్మెల్సీలు ఉండి పోరాటం చేస్తారని ప్రైవేటు ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న తనలాంటివారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే ముందుండి పోరాటం చేస్తానని అన్నారు. తాను పోటీలో ఉన్నది ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి కాదని, నిజాయితీగా తన వాళ్లకు సేవ చేయడానికి ముందుకు వచ్చానని అన్నారు. 22 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రైవేటు విద్యాసంస్థల సమస్యలపై పోరాటం చేశానని అన్నారు. ఇంతే కాకుండా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్య లపై పోరాటం చేసిన విషయం అందరికీ విధితమే అని అన్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నట్లు తనకు అన్ని విద్యార్థి సంఘాల, రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల, స్వచ్ఛంద సంస్థల మద్దతు ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడమే కాకుండా తమకు తెలిసిన పట్టభద్రుడు కూడా ఓటర్లుగా నమోదు చేయించాలని అలాగే మీ సమస్యలపై పోరాటం చేసే మీ వెన్నంటి ఉండే యాదగిరి శేఖర్ రావుకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రావుతో పాటు, జమ్మికుంట కాకతీయ విద్యాసంస్థల అధినేత సుధాకర్ రావు, ట్రస్మా నాయకులు సంపత్ రావు, ప్రతాపరెడ్డి, మల్లారెడ్డి, వకులాభరణం వెంకటేశ్వర్లు, కోమల్ రెడ్డి, కృష్ణారెడ్డి, బత్తుల రాజ్ కుమార్, కోటేశ్వర్, మాడిశెట్టి ప్రసాద్, కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శేఖర్ రావు కే ట్రస్మా మద్దతు
-ట్రస్మా నాయకుల ప్రకటన

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట: కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ట్రస్మా రాష్ట్ర సలహాదారు యాదగిరి శేఖర్ రావుకు ప్రభుత్వ మోదిత పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) తన సంపూర్ణ మద్దతు ఆయనకే ప్రకటిస్తున్నట్లు ట్రస్మా నాయకులు ప్రకటించారు. గురువారం జమ్మికుంట పట్టణంలో వివిధ పాఠశాలల్లో కళాశాలలో ఆయన పట్టభద్రుల ఓటర్ల నమోదు పై పట్టభద్రులకు ప్రైవేటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జమ్మికుంట కాకతీయ ఉన్నత పాఠశాలలో ట్రస్మా నాయకులు యాదగిరి శేఖర్ రావుకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నీ యాదగిరి శేఖర్ రావుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 22 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రభుత్వ మోదిత పాఠశాలల సమస్యలపై శేఖర్ రావు అనేక సందర్భాల్లో పోరాటం చేశాడని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలు ప్రజలను దోపిడీ చేస్తుంటే ఉపాధి కోసం పెట్టుకున్న బడ్జెట్ పాఠశాలల పరిరక్షణ కోసం శేఖర్ రావు అలుపెరుగని పోరాటం చేశాడని అన్నారు. 2002 నుంచి 2024 వరకు ట్రస్మా ఖమ్మంలో ఏర్పాటైన కాలం నుండి నేటి వరకు ప్రైవేటు పాఠశాలల అనేక సమస్యలను ఆయన పరిష్కరించాడని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ద్వారా శిక్షణ ఇప్పించేందుకు కృషి చేశాడని ఇంతే కాకుండా కరోనా సమయంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు రెండు వేల రూపాయలతో పాటు 25 కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత ఆయనదేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పాఠశాలలకు సమస్య వచ్చిన తనది అనుకుంటూ ముందుండే శేఖర్ రావుకు తప్ప ట్రస్మా పాఠశాలలో వేరే వ్యక్తులకు మద్దతు ఇవ్వడం జరగదని వారు స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు తమ అవసరాల కోసం మా పాఠశాలల వద్దకు వచ్చి మభ్యపెడుతున్నారని వారికి మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ట్రస్మ పాఠశాలలు కేవలం పట్టభద్రులు ఎమ్మెల్సీ శేఖర్ రావుకు మాత్రమే మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ఇంతకాలం ఎవరి కోసమో పని చేశాము కానీ ఇప్పుడు మా బాగోగులు చూస్తున్న వ్యక్తి కోసం మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చామని, మా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సైతం ఆయనకే మద్దతు ప్రకటించారని అన్నారు. అందుకే ట్రస్మా పాఠశాలల ముందు బహిరంగంగా శేఖర్ రావుకు మద్దతు ప్రకటిస్తూ ఫ్లెక్సీలు కట్టామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు సంపత్ రావు, సుధాకర్ రావు, ప్రతాప్ రెడ్డి, కృష్ణారెడ్డి, కోమల్ రెడ్డి, వి వెంకటేశ్వర్లు, బి రాజ్ కుమార్, కోటేశ్వర్ యాదవ్, ఎం ప్రసాద్, పి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!