Social 1080×1350 • Multi-page
27-10-2024 BREAKING NEWS 05:03 AM
swarnodayam.com
Telugu Daily News

హూజురాబాద్ నుండి అరుణాచలంకు ప్రత్యేక బస్సు.

హూజురాబాద్ నుండి అరుణాచలంకు ప్రత్యేక బస్సు.
IMG-20240825-WA1458

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఆరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయు భక్తుల కొరకు హుజురాబాద్ డిపో నుండి ప్రత్యేక సూపర్ లక్సరీ బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ వీ రవీంద్రనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.తేది 13.11.2024 రోజున మధ్యాహ్నం 2.00 గంటలకు హుజురాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకంలో గల వరసిద్ధి వినాయకున్ని దర్శించి అనంతరం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుని నవంబర్ 14వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు.
అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో నవంబర్ 15వ తేదీ సాయంత్రం బయలుదేరి 16 తేదీ ఉదయం శ్రీ అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నిధిని దర్శించి అనంతరం హుజురాబాద్ కు అదే రోజు సాయంత్రం చేరుకుంటుందన్నారు.ఈ యాత్రలో నాలుగు దేవాలయల ప్రయాణానికి అన్ని ఛార్జీలు కలుపుకుని పెద్దలకు రూ.4500/- మరియు పిల్లలకు రూ.3800/- రూపాయలు ఛార్జ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు వసతి, భోజనం మరియు దేవాలయ దర్శనం ఖర్చులు సొంతంగా భరించుకోవాలని డిపో మేనేజర్ ఆ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకై డిపో కార్యాలయం నందు గాని మరియు ఫోన్ నెంబర్లు 9959225924, 9794833971, 9866117385, 9247159535 నందు సంప్రదించాలని ఆయన సూచించారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే హుజురాబాద్, జమ్మికుంట మరియు హుస్నాబాద్ ప్రాంత వాసులు ఈ సౌకర్యంను వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.

Oplus_0

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!