Social 1080×1350 • Multi-page
27-10-2024 BREAKING NEWS 09:50 AM
swarnodayam.com
Telugu Daily News

మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం..ఘనంగా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ సేవలు ఆదర్శప్రాయం..ఘనంగా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
Oplus_131072

–మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు సత్యంగౌడ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వడ్లూరి విజయకుమార్ (బ్రహ్మచారి) నిస్వార్థ ప్రజా సేవలు ఆదర్శప్రాయమని ప్రజాకవి, రచయిత, మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షుడు నాగుల సత్యంగౌడ్ అన్నారు. పట్టణంలోని అవంతి కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రజాకవి నాగుల సత్యంగౌడ్ ఆధ్వర్యంలో వడ్లూరి విజయ్ కుమార్ 57వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం మంచి మనసే దేవుడి మందిరం అనే కవిత జ్ఞాపకను అందజేసి, పట్టు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాలలో, పలు కార్యాలయలలో కూడా విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాకవి సత్యంగౌడ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గా విజయ్ కుమార్ తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందడన్నారు. హుజురాబాద్ ప్రజల మనసుల్లో మంచి వ్యక్తిగా ప్రజా సేవకుడిగా చోటు సంపాదించుకున్నాడన్నారు. ఎందరో పేదలకు సహకరిస్తూ, ఆపదలో ఉన్నవారికి ఎందరికో తన వంతు సహాయాన్ని చేసి సేవలోనే నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుందన్న విజయ్ కుమార్ మంచి మనసుకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కట్కూరి మల్లారెడ్డి, గూడూరి కొండల్ రెడ్డి, కె బాపురావు, నాయకులు పొనగంటి శ్రావణ్ కుమార్, నాటుకోళ్ల రాజన్న, టేకుల శ్రావణ్, కొలుగూరి సూర్య కిరణ్, చిట్టి కుమార్, బిఎస్ ఇమ్రాన్, జడల సమ్మయ్య, మహేందర్ రెడ్డి, ఇప్పలపల్లి చంద్రశేఖర్, కటుకూరి కోమల్ రెడ్డి, సాయిల్ల రాజు, నవీన్, మనమయ సంఘం మాజీ అధ్యక్షుడు నందగిరి శ్రీనివాస్, కళాసాగర్, అశోక్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!