Social 1080×1350 • Multi-page
28-10-2024 BREAKING NEWS 08:26 AM
swarnodayam.com
Telugu Daily News

ఎల్ఐసీ పాలసీదారులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలి..ఏజెంట్లను అన్ని విధాలుగా ఆదుకోవాలి.-క్లాబ్యాక్ క్లాజుపై ఎల్ఐసీ ఏజెంట్ల నిరసన, ఆందోళన

ఎల్ఐసీ పాలసీదారులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలి..ఏజెంట్లను అన్ని విధాలుగా ఆదుకోవాలి.-క్లాబ్యాక్ క్లాజుపై ఎల్ఐసీ ఏజెంట్ల నిరసన, ఆందోళన
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : పాలసీ పునర్నిర్మాణం మద్య కమీషన్ కోతలు, క్లాబ్యాక్ క్లాజుపై నిరసనగా ఎల్ఐసీ ఆలిండియా లియాఫీ పిలుపు మేరకు సోమవారం హుజూరాబాద్ బ్రాంచ్ కార్యాలయం ముందు ఎల్ఐసీ ఏజెంట్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీలను పంపిణి చేసే ఏజెంట్ల పాలసీ హోల్డర్లు ముందస్తుగా సరెండర్ చేసిన పాలసీల కోసం ప్రవేశపెట్టిన కొత్త క్లాబ్యాక్ క్లాజును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఆందోళన తెలిపారు. ఈ సందర్భంగా బ్రాంచ్ లియాఫీ అధ్యక్షులు పంజాల ప్రభాకర్, కార్యదర్శి చందుపట్ల నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ…అక్టోబర్ నెలలో అమల్లోకి తెచ్చిన పాలసీ విధి విధానాలు ఏజెంట్ల మనుగడను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. బీమా రంగంలో పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం చేకూరుస్తూ ఎల్ఐసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి
తీసుకోవాలని డిమాండ్ చేశారు. కనీస భీమా రూ. 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలకు పెంచడం వల్ల సాధారణ కుటుంబాలు భీమా సౌకర్యాన్ని కోల్పోతున్నాయని అన్నారు. పాలసీ చేసుకోవడానికి 55 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించడం వలన అర్హత కోల్పోతున్నారని, మార్పులో భాగంగా ఏజెంట్లకు 1956 ఎల్ఐసీకి జాతీయం చేసినప్పుడు దానికంటే కమిషన్ తగ్గించడం వలన ఏజెంట్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఎల్ఐసీలో ఐఆర్డీఏ ప్రమేయంతో జరుగుతున్నటువంటి ఎల్ఐసీ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వంతో కుట్ర పన్నుతుందని, ఈ ప్రయత్నాన్ని మానుకొని పాత విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ పాలసీ వినియోగదారులపై జీఎస్టీ భారాన్ని తగ్గించి, ఏజెంట్లను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ లియాఫీ కోశాధికారి బాలసాని రవీందర్, జోనల్ నాయకులు దేవాల్ రెడ్డి, సాంబశివ రెడ్డి, డివిజన్ నాయకులు యం సంపత్ రావు, ఎస్ సత్తయ్య, ఒగ్గు రమేష్, కొండ తిరుపతి. జక్కె శ్రీనివాస్, రాజమల్లు, వెంకటేశ్వర్లు, ఒద్దె రమేష్, సమ్మారావు, పంజాల తిరుపతి, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!