Social 1080×1350 • Multi-page
29-10-2024 BREAKING NEWS 08:33 AM
swarnodayam.com
Telugu Daily News

విద్యుత్ చార్జీల పెంపు విరమణతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు…

విద్యుత్ చార్జీల పెంపు విరమణతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు…
IMG_20241029_192726

మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిలబడి చార్జీలు పెంచకుండా నిలువరించి నందుకు హుజురాబాద్ నియోజకవర్గంలోని రైతులతో పాటు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరిట రూ. 18,500 కోట్లు తెలంగాణ ప్రజలు, రైతులపై భారం వేయాలని చూసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతే బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుంది అన్నారు. ఇది తెలంగాణ పార్టీ విజయం కాదని తెలంగాణ ప్రజల విజయమని అన్నారు. అనంతరం ఒకరికొకరు సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాద ముత్యంరాజు, ముక్క రమేష్, కేసిరెడ్డి లావణ్య, మారపల్లి సుశీల, నాయకులు ఏండి ఇమ్రాన్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!