Social 1080×1350 • Multi-page
29-10-2024 BREAKING NEWS 12:29 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ మరియు హాకీ పోటీల నిర్వహణ

హుజురాబాద్ పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కబడ్డీ మరియు హాకీ పోటీల నిర్వహణ
IMG-20241029-WA0097

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాల బాలికల కబడ్డీ టోర్నమెంటు కం సెలక్షన్స్ మరియు అండర్ 14 మరియు అండర్ 17 years హాకీ బాల బాలికల సెలక్షన్స్ గవర్నమెంట్ ఉన్నత పాఠశాల హుజురాబాద్ లో నిర్వహిస్తున్నామని హుజూరాబాద్ ఎంఈఓ బి శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సొల్లు సారయ్య లు తెలిపారు. ఇందులో పాల్గొనే వారు జిల్లా కబడ్డీ జట్లు ప్రారంభ కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని, ప్రతి టీం కూడా వారి వారి జిల్లా ఫ్లాగ్ తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకు హుజురాబాద్ GOVT హై SCHOOL గ్రౌండ్లో హాజరు కావాలని కోరారు. నవంబర్ 02న అండర్ 14 YEAR కబడ్డీ బాల బాలికలకు, అదే రోజు అండర్ 14 మరియూ అండర్ 17 హాకీ బాల బాలికలకు పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరు కూడా వారి వారి ఎలిజిబులిటీ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్ జతచేస్తూ తప్పకుండా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో PD CHIRUTHA SRINIVAS మరియూ PET ఏముల రవికుమార్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!