Social 1080×1350 • Multi-page
31-10-2024 BREAKING NEWS 02:49 AM
swarnodayam.com
Telugu Daily News

కాట్రపల్లిలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

కాట్రపల్లిలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
IMG_20241031_134631

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కాట్రపల్లి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్దార్ పటేల్ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరని, నిజాం ప్రభుత్వం మెడలు మంచి సైనిక చర్య ద్వారా తెలంగాణకి స్వాతంత్రం ఇప్పించడంలో సర్దార్ పటేల్ పాత్ర మరువలేనిదని కొనియాడారు. భారతదేశంలో చిన్న చిన్న సంస్థానాలన్నిటిని భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఒకే దేశంగా సంస్థానాలు లేని దేశంగా మార్చడంలో సర్దార్ పటేల్ కృషి ఎనలేనిదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాముల కుమార్, మండల ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, మండల కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, యువ మోర్చా మండల అధ్యక్షుడు నరేడ్ల చైతన్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి దేవగౌడ, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గోపగాని సమ్మయ్య, బేతి తిరుపతిరెడ్డి, కాట్రపల్లి బూత్ అధ్యక్షులు తాళ్లపల్లి అనిల్, ముప్పు కోటి, గౌడ సంఘం నాయకులు కోటి, మరియు శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!