Social 1080×1350 • Multi-page
01-11-2024 BREAKING NEWS 04:11 AM
swarnodayam.com
Telugu Daily News

మాలల ఐక్యత అభివృద్ధి సమావేశం కరపత్రం ఆవిష్కరణ.

మాలల ఐక్యత అభివృద్ధి సమావేశం కరపత్రం ఆవిష్కరణ.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు మాలల ఐక్యత అభివృద్ధి కరపత్రలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో మాలలు అన్ని రంగాలలో వెనుక బడిపోయినారని గత 40 సంవత్సరాలుగా విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలు మిగతా అన్ని రంగాల్లో కూడా చాలా వెనుకబడిపోయినారని తాజా గణాంకాల ప్రకారం తెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మాలలపై ఒక పథకం ప్రకారం సోదర ఎస్సీ కులాల వాళ్ళు తప్పుడు విష ప్రచారం చేస్తూ దురుద్దేశంతో అబండాలు వేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాలల జనాభా కీలకంగా పెరిగిపోయిన సమయంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు గాని, దళిత బంధు పథకాలలో గాని దళితులకు మూడెకరాల భూమి పంపిణీ విషయంలో గాని ఇలా అన్ని రంగాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మాలలు విద్య, వైద్యం, వ్యాపారం, సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక మొదలగు రంగాల్లో మాలలు అందరూ ఏకమై క్రియాశీలక పాత్ర కరీంనగర్ జిల్లాలో జరిగే ఐక్యత అభివృద్ధి సమావేశాన్ని 03 నవంబర్, 2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 02 గంటలకు పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, మహిళలు రైతులు రాజకీయ నాయకులు తదితరులు అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కరపత్రం ఆవిష్కరణ సమావేశంలో సొల్లు బాబు, పాక సతీష్ ,పసుల స్వామి, తొ గరు బుచ్చయ్య, సొల్లు దశరథం, తొగరు బిక్షపతి, కత్తెర మల్ల సదానందం, తొగరు స్వామి, కోడం నరసింగం, సందమల్ల నరేష్, చౌడమల్ల నరేష్, జంగా అనిల్, ఎం సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!