Social 1080×1350 • Multi-page
01-11-2024 BREAKING NEWS 07:19 AM
swarnodayam.com
Telugu Daily News

కోదండరాం సదస్సు ను విజయవంతం చేయండి

కోదండరాం సదస్సు ను విజయవంతం చేయండి
IMG-20241101-WA0062

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నవంబర్ 3 ఆదివారం రోజున, హుజురాబాద్ సిటీ సెంట్రల్ లో జరిగే ‘పౌర సమాజంతో కోదండరాం మాటా ముచ్చట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజేఎస్, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ గా నియామకమై మొదటిసారిగా హుజురాబాద్ పట్టణానికి వస్తున్న సందర్భంగా టీజేఎస్, పౌర, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పౌర సమాజం తో కోదండరాం మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహిస్తుట్లు వారు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యమ కారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జీ ముక్కెర రాజు, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మార్త రవీందర్, భీమోజు సదానందం, కొత్తూరి రమేష్, పాక సతీష్, వేల్పుల ప్రభాకర్, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!