Social 1080×1350 • Multi-page
02-11-2024 BREAKING NEWS 08:11 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు..జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. -ప్రభుత్వాస్పత్రిలో పండ్లు పంపిణి చేసిన జయపాల్ రెడ్డి సరిత

ఘనంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలు..జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. -ప్రభుత్వాస్పత్రిలో పండ్లు పంపిణి చేసిన జయపాల్ రెడ్డి సరిత
IMG_20241102_190128

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ జన్మదిన వేడుకలను జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు, సింగాపూర్ మాజీ ఎంపీటీసీ గుడిపాటి జయపాల్ రెడ్డి -సరితల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 34 కిలోల జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణి చేసి బల్మూరి వెంకట్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా సుమారు 98 మంది యువకులు, కార్యకర్తలు స్వచ్చందంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో జయపాల్ రెడ్డి సరితలు మాట్లాడుతూ… విద్యార్ధుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎన్ ఎస్ యుఐ పక్షాన పోరాడుతూ ఎన్ ఎస్ యుఐ నాయకునిగా, రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా అంచలంచలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో బల్మూరి వెంకట్ మంచి గుర్తింపు పొందారని కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, వెంకట్ తో పాటు తాను కూడా ఉద్యమంలో పాల్గొన్న సందర్భాన్ని గుర్తు చేశారు. ఇలాగే ప్రజలకు సేవలందిస్తూ భవిష్యత్లో ఉన్నత పదవులు పొందాలని, ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరిన్ని ఆకాంక్షించారు. రక్తదానం చేసిన యువకులను, కార్యకర్తలను అభినందిస్తూ మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్న ఇతరుల ప్రాణాలను కాపాడుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో సుమారు 60 మంది రోగులకు, డయాలసిస్ పేషెంట్లకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో దావకాన సూపరిండెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్ రావు, టీపీసీసీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, జమ్మికుంట మాజీ జెడ్పిటిసి అరుకాల వీరేశలింగం, చెల్పూర్ మాజీ సర్పంచ్ పోలంపెల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి మోలుగురి ప్రభాకర్, జమ్మికుంట అధ్యక్షులు కసుబోసుల వెంకన్న, మండల అధ్యక్షులు రాజేశ్వర్రావు, జేఏసి నాయకులు వెల్పల రత్నం, వెల్పుల ప్రభాకర్, ప్రజా సంఘాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు రంజిత్ రెడ్డి, పిట్టల మొగిలి, ఇంద్రారెడ్డి, అప్పల రఘుపతి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!