Social 1080×1350 • Multi-page
02-11-2024 BREAKING NEWS 09:49 AM
swarnodayam.com
Telugu Daily News

ముగిసిన కబడ్డీ, హాకీ పోటీలు

ముగిసిన కబడ్డీ, హాకీ పోటీలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 14 బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగాయి. ఈ టోర్నమెంట్ లో కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన కబడ్డీ టీములు పాల్గొనగా, ఆయా టీముల నుండి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎస్ జి ఎఫ్ కార్యదర్శి సొల్లు సారయ్య తెలిపారు. ఈ టోర్నమెంట్ లో బాలికల విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా సిరిసిల్ల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో సిరిసిల్ల జట్టు ప్రథమ స్థానంలో నిలువగా కరీంనగర్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

హాకీ ఎంపికకు 200 మంది క్రీడాకారులు

హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో ఉమ్మడి జిల్లా స్థాయి హాకీ క్రీడాకారుల ఎంపిక కోసం 200 మంది క్రీడాకారులు హాజరైనట్లు నిర్వాహకులు యెముల రవికుమార్ తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, హాకీ క్లబ్ రాష్ట్ర నాయకులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, హాకి క్లబ్ రాష్ట్ర నాయకులు తోట రాజేంద్రప్రసాద్, కబడ్డీ క్రీడాకారులు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్థానిక పాఠశాల హెచ్ఎం తిరుమల, కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, రాజేశ్వర్ రెడ్డి, గోవర్ధన్, శ్రీనివాస్ రెడ్డి, రావుల వేణు, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!