Social 1080×1350 • Multi-page
03-11-2024 BREAKING NEWS 09:26 AM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టుల సమస్యను త్వరలో సీఎం దృష్టి తీసుకువెళ్లి పరిష్కరిస్తా.. -ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం..

జర్నలిస్టుల సమస్యను త్వరలో సీఎం దృష్టి తీసుకువెళ్లి పరిష్కరిస్తా.. -ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం..
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, నవంబర్03: జర్నలిస్టులకు ఇచ్చిన నివేషణ స్థలాల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఆదివారం స్థానిక సిటీ సెంట్రల్ హాల్ లో “పౌర సమాజంతో మాట – ముచ్చట” కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే (ఐజేయు) ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే జర్నలిస్టుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్, ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, సభ్యులు పోతరాజు సంపత్, వేల్పుల సునీల్ కుమార్, చిట్టెంపల్లి సృజన్ తేజస్విరాజ్, కామని రవీందర్, పిల్లల సతీష్, గోపగాని మహేష్, టేకుల సాగర్, పబ్బ తిరుపతి, తాటిపాముల దేవేందర్, కుడికాల సాయి, గోస్కుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!