Social 1080×1350 • Multi-page
04-11-2024 BREAKING NEWS 02:23 AM
swarnodayam.com
Telugu Daily News

వడ్ల కొనుగోళ్లు లేక వెలవెల బోతున్న హుజూరాబాద్ మార్కెట్ యార్డు.. – మొద్దు నిద్రబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. -బిజెపి నేతల ఆరోపణ

వడ్ల కొనుగోళ్లు లేక వెలవెల బోతున్న హుజూరాబాద్ మార్కెట్ యార్డు.. – మొద్దు నిద్రబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. -బిజెపి నేతల ఆరోపణ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ హుజూరాబాద్ పట్టణ-మండల శాఖల అధ్యక్షులు గంగిశెట్టి రాజు మరియు రాముల కొమరయ్యల ఆధ్వర్యంలో పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు పడుతున్న భాదని కళ్లారా వీక్షించటం జరిగింది.
హుజూరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో రైతుల పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన కొనేదిక్కు లేకుండా పోయిందని, పలు గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించని దుస్థితి ఉందని బిజెపి నేతలు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను పోసుకొని రైతులు రోజుల తరబడి పంట కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలన్నీ వడ్ల కుప్పలతో నిండిపోయి, స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న.. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించకపోవడం బాధాకరం అన్నారు. వాతావరణ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో చేస్తున్న ప్రకటనకు ఆచరణకు పొంతన లేకుండా పోయిందన్నారు. రైతుల పంట కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు, కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేయాలని బిజెపి హుజూరాబాద్ పట్టణ శాఖ మరియు మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. పంట కొనుగోళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, వడ్ల కొనుగోళ్లను తక్షణం ప్రారంభించాలని, అలాగే అన్ని రకాల సన్న వడ్లకు మద్దతు ధర చెల్లించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూపాయలు 500 బోనస్ ఇవ్వాలని బిజెపి పట్టణ మరియు మండల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు తాసిల్దార్ కనుకయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ మరియు మండల శాఖ కమిటీలు ప్రజా ప్రతినిధులు, బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, కేస్ రెడ్డి విజేందర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, పట్టణ కార్యదర్శి పడారి కొమురయ్య, మాజీ సర్పంచ్ ఉపాధ్యక్షులు పోతుల సంజీవ్, యాళ్ల సంజీవరెడ్డి, తిప్పపతిని రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, కోలిపాక శ్రీనివాస్, నరాల రాజశేఖర్, యువ మోర్చా మండల అధ్యక్షులు నరెడ్ల చైతన్య రెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గంట సంపత్, మండల కార్యదర్శి చిదురాల శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి, కోలిపాక వెంకటేష్ , ఆవుల సదయ్య, కుసుమ సమ్మయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!