Social 1080×1350 • Multi-page
05-11-2024 BREAKING NEWS 08:17 AM
swarnodayam.com
Telugu Daily News

పోచమ్మ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తాం..-మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక

పోచమ్మ దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తాం..-మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక
IMG_20241105_191406

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని స్థానిక పోచమ్మ దేవాలయం గర్భగుడి ప్రాంగణంలో సీసీ ఫ్లాట్ ఫారం అభివృద్ధి పనులకు హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ మరియు స్థానిక 5వ, 4వ వార్డు కౌన్సిలర్లను ఆలయ కమిటీ మెంబర్లు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాధిక మాట్లాడుతూ పట్టణం మొత్తానికి కలిపి ఉన్న ఏకైక పోచమ్మ దేవస్థానం ఇదే అన్నారు. దేవస్థానంకి రోజు రోజుకి భక్తుల తాకిడి పెరుగుతున్నందున దానికి అనుగుణంగా మా మున్సిపల్ పాలకవర్గం సహకారంతో దశల వారిగా మరింత అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అపరాజ ముత్యంరాజు, ప్రతాప తిరుమల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య , మున్సిపల్ ఏ ఈ సాంబరాజు, మరియు ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!