Social 1080×1350 • Multi-page
05-11-2024 BREAKING NEWS 11:53 AM
swarnodayam.com
Telugu Daily News

పట్టభద్రులు అందరికీ రూ. 1కె హెల్త్ ఇన్సూరెన్స్.. _కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్…

పట్టభద్రులు అందరికీ రూ. 1కె హెల్త్ ఇన్సూరెన్స్.. _కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్…
IMG_20241105_225150

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ నవంబర్ 5: హుస్నాబాద్లోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ విధ్య సంస్థలలో ప్రచారంలో సర్దార్ రవిందర్ సింగ్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలలోని పట్టభద్రులు అందరితో పాటు ప్రభుత్వ, ప్రయివేట్ ఉపాధ్యాయులకు రూ 1రూపాయికే ప్రమాద భీమా (ఇన్సూరెన్) చేయిస్తామని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవిందర్ సింగ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ విద్య సంస్థల ఉపాధ్యాయులు, పట్టభద్రులుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని వారితో పంచుకున్నారు. తాను కరీంనగర్ మేయర్ ఉన్నప్పుడు రూపాయికే నల్లా కనెక్షన్ తో పాటు ఒక్క రూపాయికే అంత్యక్రియల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సందర్భంలో దేశ వ్యాప్తంగా కరీంనగర్ పేరు ను భారతదేశంలో గుర్తించే విధంగా పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీలో దిగుతున్నానని తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్సీగా పట్ట భద్రులు, ప్రభుత్వ
-ప్రయివేట్ టీచర్ల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకొస్తానన్నారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, గొట్టం మహేష్, పోన్నం అనీల్ గౌడ్, నాగరాజు, గణేష్, మేకల చంద్రశేఖర్ యాదవ్, తేజ్దీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!