Social 1080×1350 • Multi-page
05-11-2024 BREAKING NEWS 12:07 PM
swarnodayam.com
Telugu Daily News

అక్రమ మట్టి తవ్వకాలపై ఉన్నత అధికారుల విచారణ

అక్రమ మట్టి తవ్వకాలపై ఉన్నత అధికారుల విచారణ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజూరాబాద్: హుజూరాబాద్ మండలం రంగాపూర్, సిర్సపల్లి శివారులోని పాండవుల గుట్ట సమీపంలో అసైన్డ్ భూమిలో అక్రమంగా కొంతమంది మట్టి తవ్వకాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై మైనింగ్, రెవెన్యూ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. ఈ విచారణలో హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ , జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ రామాచారి ఆధ్వర్యంలో అధికారులు పాండవుల గుట్ట సమీపంలో నిర్వహిస్తున్న క్రషర్లు, క్వారీలను పూర్తిగా అధికారులు పరిశీలించారు. రెండు క్రషర్ల కంపెనీలను డీఫాల్టర్లుగా గుర్తించారు. ఆయా క్రషర్ల ప్యూజులు తొలిగించి, విద్యుత్ కనెక్షన్లు తొలగించేందుకు, తదుపరి చర్యలకు విద్యుత్ శాఖ అధికారులకు సిఫారసు చేశారు. అనుమతిలేకుండా జరిపిన మట్టితవ్వకాలపై డీబీఎల్ కంపెనీ ఇదివరకే 1.35కోట్ల రూపాయలు ఫైన్ విధించినట్టు అధికారులు తెలిపారు. డీబీఎల్ కంపెనీ పరిధిలో మట్టి మాఫియా రాత్రివేళ అనధికారికంగా మట్టి సరఫరా జరపకుండా ఉండేందుకు వాహనాలు రాకుండా డీబీఎల్ పరిధిలో చెక్పోస్ట్, క్వారీ వద్ద కంపౌండ్ వాల్ నిర్మించి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాలను గుర్తించి పోలీసులకు, అధికారులకు సమాచారం అందించాలని వారు సూచించారు. మరో సారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని డీబీఎల్ కంపెనీ సిబ్బందిని హెచ్చరించారు. అలాగే ఈటీఎస్ సర్వే చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మట్టి తవ్వకాలకు గురైన రైతులు అందుబాటులో లేకపోవడంతో పూర్తి విచారణ జరపకుండానే అధికారులు వెనుదిరిగారు. బాధితులంతా వస్తే విచారణ జరిపి, న్యాయం చేస్తామని ఫిర్యాదుదారులు కోడూరి సమ్మయ్య, మాజీ సర్పంచ్ అరెపెల్లి ఎల్లయ్య, కండె తిరుపతికి అధికారులు హామీ ఇచ్చారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!