Social 1080×1350 • Multi-page
05-11-2024 BREAKING NEWS 12:40 PM
swarnodayam.com
Telugu Daily News

నేటి నుంచి కుటుంబాల లెక్కింపు

నేటి నుంచి కుటుంబాల లెక్కింపు
IMG-20240711-WA0154

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో భాగంగా ఈనెల 6 నుండి హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో కుటుంబాల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య తెలిపారు. హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డులను 2011 జనాభా లెక్కల ప్రకారం 63 బ్లాకులుగా విభజించినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క బ్లాక్ కు ఒక్కొక్క ఎమ్యునరేటర్ ను నియమించినట్లు ఆయన తెలిపారు. వీరిని పర్యవేక్షించడానికి గాను ఆరుగురు సూపర్వైజర్ లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఎమ్యునరేటర్లు వారికి కేటాయించిన ప్రాంతంలో ఇంటింటికి తిరిగి కుటుంబాల లెక్కింపు చేస్తారని, వారు వెళ్లిన ప్రతి ఇంటికి కుల గణన సర్వే స్టిక్కర్ అతికిస్తారని అన్నారు. కుటుంబాల సర్వే అనంతరం ఈనెల 10 నుండి అసలు సర్వే ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!