Social 1080×1350 • Multi-page
06-11-2024 BREAKING NEWS 07:50 AM
swarnodayam.com
Telugu Daily News

సైబర్ నేరాల పట్ల అవగాహాన కార్యక్రమం..కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ నర్సింహా రెడ్డి.

సైబర్ నేరాల పట్ల అవగాహాన కార్యక్రమం..కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ నర్సింహా రెడ్డి.
IMG-20241106-WA0072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: సైబర్ జాగృతి దివస్ సందర్బంగా కరీంనగర్ భగత్ నగర్ లోని బృందావన్ గార్డెన్ నందు బుధవారంనాడు సిటిజెన్ రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ నేరాల పట్ల అవగహన కార్యక్రమం నిర్వహించామని కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ. ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల నుండి పదవి విరమణ పొందిన ఉద్యోగులు దాదాపు 100 మంది వరకు పాల్గొన్నారన్నారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లడుతూ ఇటీవల కాలంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సైబర్ నేరాలు జరిగే తీరుపట్ల అవగాహనా కలిగివుండాలని అన్నారు. చాలా వరకు ప్రజలు అవగాహనారాహిత్యం వల్లే అపరిచితుల ఫోన్ కాల్స్ మరియు మెసేజ్ లకు స్పందించి వారి ఖాతాల్లో గల డబ్బును కోల్పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ , ఆన్లైన్ నందు జరిగే మోసాలు, వాయిస్ క్లోనింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను ఏమార్చి ఖాతాల్లో గల డబ్బును దొంగిలించే విధానాలపై అవగాహనా కల్పించామన్నారు. వీటిని అడ్డుకోవాలంటే సైబర్ నేరగాళ్లు నిత్యం మారుస్తున్న పంథాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎం ఎల్ ఏ మోహన్ రెడ్డి, రిటైర్డ్ మాజీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నుండి మోహన్ రెడ్డి , కేశవ రెడ్డి, రిటైర్డ్ డిఫెన్స్ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!