Social 1080×1350 • Multi-page
06-11-2024 BREAKING NEWS 08:18 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్ డి ఓ(RDO)కి వినతి

ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్ డి ఓ(RDO)కి వినతి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల SRSP ప్రధాన కాలువను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కొంత మంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) రమేష్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి SRSP కి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని ఇండ్లు నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేశారన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో యదేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని పలు నిర్మాణాలు చేపడుతున్నారని, అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. తక్షణమే సదురు నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని లేని పక్షంలో ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత ఉన్నతాధికారులను సంబంధిత శాఖ మంత్రిని కలుస్తామని చెప్పారు. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని ప్రజల అవసరాలకు మరియు వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయిస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని శ్రవణ్అన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!