Social 1080×1350 • Multi-page
06-11-2024 BREAKING NEWS 08:30 AM
swarnodayam.com
Telugu Daily News

మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు సర్వనాశనం అవుతాయి – ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు

మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు సర్వనాశనం అవుతాయి – ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు
IMG_20241106_192832

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్08: మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు సర్వనాశనమవుతాయని ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపారు. మున్సిపల్ పరిధి బోర్నపల్లిలోని జడ్పీహెచ్ఎస్, వీణవంక బీసీ వెల్ఫేర్ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ కు దూరంగా ఉండి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వినోద్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సంపత్, బి రాజిరెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!