Social 1080×1350 • Multi-page
06-11-2024 BREAKING NEWS 09:10 AM
swarnodayam.com
Telugu Daily News

7న “శూద్ర” పుస్తకావిష్కరణ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత ఇమ్మడి సంపత్ కుమార్ రాసిన “శూద్ర” కథల సంపుటిని ప్రముఖ కవి, రచయిత, వక్త, విశ్లేషకులు ప్రొఫెసర్ చింతకింది కాశీo ఈనెల 07గురువారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించి, ప్రధాన ప్రసంగం చేస్తారని రచయిత ఇమ్మడి సంపత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. “శూద్ర” పుస్తక ఆవిష్కరణ సమావేశంలో అంబేద్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అందరికీ పేరుపేరునా కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!