Social 1080×1350 • Multi-page
07-11-2024 BREAKING NEWS 08:14 AM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ ఉజ్వల పార్కుకు వెలిచాల పార్కుగా పేరు పెట్టాలి.. – రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుకాంగ్రెస్ నేతల వినతి

కరీంనగర్ ఉజ్వల పార్కుకు వెలిచాల పార్కుగా పేరు పెట్టాలి.. – రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుకాంగ్రెస్ నేతల వినతి
Oplus_131072

–జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు 20 గుంటల స్థలం కేటాయించాలి..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ ఉజ్వల పార్కుకు దివంగత నేత, తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి సరిల్లా రతన్ రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గండి రాజేశ్వరరావు పలువురు నాయకులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కరీంనగర్ నగర పరిధిలో జగపతిరావు విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలాన్ని కేటాయించాలని కోరారు. జగపతిరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారని, పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారని పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లిమిట్స్‌లోని ఏ ప్రదేశంలోనైనా విగ్రహం ఏర్పాటు చేసేందుకు 20 గుంటల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా జగపతిరావు పనిచేసిన కాలంలో దిగువ మానేర్ డ్యామ్ పక్కన ఒక ఉజ్వల పార్కును ఏర్పాటు చేయించారని చెప్పారు. ఇది కరీంనగర్ కే ప్రస్తుతం తలమానికంగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రజలకు పర్యటకంగా ఎంతో ఉపయోగపడుతుందని, ఉజ్వల పార్కుకు పేరు పెట్టాలని వినతి పత్రంలో కోరారు.

Oplus_131072

జగపతిరావు 1972 నుంచి 1977 వరకు జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, 1978 నుంచి 1984 వరకు ఎమ్మెల్సీగా,. 1989 నుండి 1994 వరకు కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. జగపతిరావు కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ నేత, డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. ఆయన అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి కరీంనగర్ ప్రజలు ఆయనను ప్రజాబంధు అని పిలుస్తారనీ తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో జగపతిరావు కరీంనగర్‌లో అడవుల శాతం (%) తక్కువగా ఉన్నందున అతను చాలాసార్లు లోతైన ఆలోచన చేసి కరీంనగర్ ఉజ్వల పార్కు ఏర్పాటుకు శాయశక్తుల కృషి చేశారని తెలిపారు. జగపతిరావుకు మొక్కలు అన్న చెట్లన్న ఎంతో ప్రాణమని, ఆయన ఇంట్లో మొక్కలతో ఒక పెద్ద నందన వనమే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజల్లో మంచి పేరును జగపతిరావు పేరును కరీంనగర్ ఉజ్వల పార్కు పెట్టాలని మంత్రిని కాంగ్రెస్ నాయకులు కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!