Social 1080×1350 • Multi-page
07-11-2024 BREAKING NEWS 11:50 AM
swarnodayam.com
Telugu Daily News

ఉపాధ్యాయుడు, రచయిత అనువాదకుడు ఇమ్మడి సంపత్ కుమార్ రచించిన ‘ శూద్ర ‘ హిందీ అనువాద కథలు పుస్తక ఆవిష్కరణ

ఉపాధ్యాయుడు, రచయిత అనువాదకుడు ఇమ్మడి సంపత్ కుమార్ రచించిన ‘ శూద్ర ‘ హిందీ అనువాద కథలు పుస్తక ఆవిష్కరణ
IMG_20241107_224630

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం ప్రముఖ ఉపాధ్యాయుడు రచయిత అనువాదకుడు ఇమ్మడి సంపత్ కుమార్ రచించిన ‘ శూద్ర ‘ హిందీ అనువాద కథలు పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చింతకింది కాశీo మాట్లాడుతూ.. యదార్థ జీవిత ఇతివృత్తం ఉంటేనే చదివే పాఠకులను ఆకట్టుకుంటుందని, సంపత్ రచించిన రచనలు సామాజిక స్పృహ కలిగినవని అభినందించారు. రచయిత పాత్రికేయులు జేఏసీ చైర్మన్ అవునూరి సమ్మయ్య మాట్లాడుతూ….విద్యార్థి దశ నుండే సంపత్ ప్రగతి భావాలతో పెరిగాడని, ఆయనలోని రచయిత సమాజ మార్పు కోసం అక్షర రూపం ఇచ్చాడని అన్నారు. ఈ ఆవిష్కరణ సభలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యాయవాది ముక్కెర రాజు, డిటిఎఫ్ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజ్యం ప్రొఫెసర్ శేఖర్, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, భీమోజు సదానందం, ఇమ్మడి బాబు, రహీం, బాబ్జి, రోoటాల బుచ్చయ్య, ఆవాల హరిబాబు, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!