Social 1080×1350 • Multi-page
07-11-2024 BREAKING NEWS 12:07 PM
swarnodayam.com
Telugu Daily News

మత్తు, మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలి.. – హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్

మత్తు, మాదక ద్రవ్యాలను దూరంగా ఉండాలి..  – హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
IMG_20241107_230529

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
విద్యార్థులు మత్తుకు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా దూరంగా ఉండాలని హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల లో విద్యార్థులకు మత్తు మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాటి వల్ల మన జీవితాలు పాడవుతాయని అన్నారు. ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ మాట్లాడుతూ…. క్రమశిక్షణ కలిగి చదువు పట్ల జిజ్ఞాసతో ముందుకు సాగాలని అంతేగాని దురవల్లవాట్లకు మత్తుకు బానిసైతే మన జీవితం పాడయి పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ ముకుంద రెడ్డి సంతోష్, రాజశేఖర్, స్వాతి రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

– రాంపూర్ పాఠశాలలో….
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలతో జరిగే అనర్థాలను వివరించారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్, సురేందర్, పీఈటి భాగ్యలక్ష్మి, సుకన్య, రోజ లీలా, విజయలక్ష్మి, జమున తదితరులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!