Social 1080×1350 • Multi-page
09-11-2024 BREAKING NEWS 09:20 AM
swarnodayam.com
Telugu Daily News

విద్యుత్ శాఖ ఆర్టీషియన్లను రెగ్యులరైజ్ చేయండి

విద్యుత్ శాఖ ఆర్టీషియన్లను రెగ్యులరైజ్ చేయండి
IMG-20241109-WA0161

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ , నవంబర్ 9: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శనివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యంలకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ (టీవీఏసీ జేఏసీ) ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. విద్యుత్ శాఖలో పనిస్తున్న ఆర్టిజన్ కార్మికులు గత 20 , 25 సంవత్సరాల నుండి శ్రమదోపిడికి గురౌతున్నాం అని. ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి కానీ మాకు బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ ఇచ్చారన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నైనా మాకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కార్మికులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం అన్నారు. ప్రభుత్వం మాకు పూర్తిగా న్యాయం చేయాలనీ కోరడం జరిగిందని, దీనికి ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించి మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ జీ. శివకృష్ణ, ఫైనాన్సియల్ సెక్రటరీ ఏండీ అమానుల్లా, కే శ్రీనివాస్ నాయక్ , ఏం శ్రీనివాస్, ఏండీ అబుషర్, పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!