Social 1080×1350 • Multi-page
09-11-2024 BREAKING NEWS 12:16 PM
swarnodayam.com
Telugu Daily News

కన్నుల పండువగా గ్యార్మి జెండా పండుగ.. పాల్గొన్న పలువురు ప్రముఖులు

కన్నుల పండువగా గ్యార్మి జెండా పండుగ.. పాల్గొన్న పలువురు ప్రముఖులు
IMG_20241109_231338

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని మామిళ్ల వాడలో ముస్లింల పవిత్ర పండుగ గ్యార్మీ జెండా పండుగ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జండా గద్దే నుంచి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై జెండాను ఉంచి పట్టణంలోని వాడవాడ నా ఊరేగించి తిరిగి జండా గద్దెకు చేర్చారు. ముస్లిం యువతీ యువకులు జెండా ఎదుట ప్రత్యేక నృత్యాలు చేస్తూ సంతోషంగా ఆడి పాడారు. జెండాను పలువురు ప్రముఖులు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్శించిన వారిలో హుజురాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మత గురువులు మహమ్మద్ అలీమ్. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణయ్ బాబు, మాజీ sc కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, రెండో వార్డ్ కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, ఉజ్మానూరిన్ ఇమ్రాన్, గఫర్ , మిలాత్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!