Telugu Daily News
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం, ప్రణవ్.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్ లో చెల్పూరు గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నేరెళ్ల మహేందర్ గౌడ్ కుమార్తె వివాహానికి హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వోడితెల ప్రణవ్ లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్, సిద్ధిపేట గ్రంథాలయ కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి, రాష్ట్ర నాయకులు పత్తి కృష్ణారెడ్డి, దొంత రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.


