Social 1080×1350 • Multi-page
11-11-2024 BREAKING NEWS 11:13 AM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ
1000011659

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్‌: తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసులు కార్యదర్శిగా స్మిత సబర్వాల్‌ను నియమించారు. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో స్మిత సబర్వాల్‌ కొనసాగనున్నారు.

బదిలీ అయిన ఇతర ఐఏఎస్‌ల వివరాలివీ..

బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ శ్రీధర్‌
దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఇ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు మహిళ,శిశు సంక్షేమం,ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి రవాణాశాఖ కమిషనర్‌గా కె సురేంద్రమోహన్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్‌ ట్రాన్స్‌కో సీఎండీగా డి కృష్ణభాస్కర్‌
డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్న కృష్ణభాస్కర్‌
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్‌
పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా ఎస్‌ కృష్ణ ఆదిత్యలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!