12-11-2024 NORMAL NEWS 08:50 AM
swarnodayam.com
Telugu Daily News
12-11-2024 08:50 AM By Mandala Yadagiri

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పై విద్యార్థులకు శిక్షణ

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పై విద్యార్థులకు శిక్షణ
IMG_20241112_194920

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం లో జరుగుతున్న రీసెంట్ అడ్వాన్సు ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 6 రోజుల అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ హైదరాబాద్ కు చెందిన డిప్యూటీ మేనేజర్ ఇంజనీర్ టి ముత్తు కుమారన్ శిక్షణ ఇచ్చారు. వీరు అధ్యాపకులు ఉద్దేశించి మాట్లాడుతూ సౌర విద్యుత్తును సామాన్య జనులకు ఉపయోగములో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారు ఎన్నో సహాయక కార్యక్రమాలు చేస్తున్నారని, తెలిపారు. భారత ప్రభుత్వం వారు 2021 లో జరిగిన క్లైమాటిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ పారిస్ లో సౌర విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించి బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును ఉపయోగించడం తగ్గిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగముగా సౌర విద్యుత్తును వాడుకలో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారు చాలా కార్యక్రమాలు చేపట్టారు. 2019లో మూడు దిగా వాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసిన భారతదేశము 2019లో 30 గిగా వాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసిందని ముత్తుకుమార్ అన్నారు. 2030 వరకు కేంద్ర ప్రభుత్వ లక్ష్యము 500 గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయటం అని చెప్పారు. సోలార్స్ విద్యుత్తును మామూలు విద్యుత్ వలే అన్ని అవసరాలకు వినియోగించవచ్చునని, బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తు ఎక్కువ వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తుందని, మానవ జీవనానికి హాని చేస్తుందని, థర్మల్ విద్యుత్ వలన బొగ్గును కాల్చడం వలన బూడిద వస్తుందని ఈ బూడిద చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సారవంతమైన నేలలను పాడు చేస్తుందనే పంటల ఉత్పత్తిని తగ్గిస్తుందని అందువలన, అందరూ సోలార్ విద్యుత్తును ఉపయోగించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ సింగాపురం కళాశాలలో సౌర విద్యుత్తు మీదా విద్యార్థులు ఎన్నో మంచి ప్రాజెక్టులను చేశారని తెలిపారు.
మధ్యాహ్న శిక్షణా కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగపూర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాపు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ షా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. రాంషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము త్వరలో చాలా విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెచ్చి వాటిని ఉపయోగిస్తుందని రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లలో నడుస్తున్న ప్రస్తుత వాహనాలను తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించడం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఈశ్వరయ్య, ఈ కార్యక్రమం సమన్వయకర్త మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, dean డాక్టర్ యోగేష్ పుండలిక్, సహ సమన్వయకర్త అధ్యాపకుడు డాక్టర్ ఏ కొమురయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!