12-11-2024 NORMAL NEWS 10:34 PM
swarnodayam.com
Telugu Daily News
12-11-2024 10:34 PM By Mandala Yadagiri

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు బోల్తా – దిల్లీ, చెన్నై మార్గంలో రాకపోకలకు అంతరాయం – పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ…- గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఆరా తీసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు బోల్తా – దిల్లీ, చెన్నై మార్గంలో రాకపోకలకు అంతరాయం – పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ…- గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఆరా తీసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
IMG_20241113_095518

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:

పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లో అర్ధరాత్రి గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బల్లారి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు స్టీల్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలులో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లోలో పైలట్‌, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్‌ రైలు అధిక లోడ్‌ వల్లే పట్టాలు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు.ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ క్రేన్ లతో పట్టాల పై పడ్డ బోగీలను అందులో ఉన్న మెటీరియల్ సిబ్బంది తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సుమారు 20 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. 18 రైళ్లు దారిమల్లించామని పాక్షికంగా 4 రైళ్ల రద్దు చేసినట్లు తెలిపారు.

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ఆరా తీసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశించారు. పెద్దపల్లి — మంచిర్యాల మార్గంలోని ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎంపీ కోరారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలుసుకొని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిల్లీ నుండి సౌత్ కి నడిచే ఏకైక దారి ఇది…

రాత్రి జరిగిన ప్రమాదంలో రైలు పట్టాలు తప్పడంతో రాకపోకలు నిలిచిపోయాయి…అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను వెంటనే అన్వేషించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు…ప్రమాద స్థలంలో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!