Social 1080×1350 • Multi-page
13-11-2024 BREAKING NEWS 01:01 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వస్తే ఖబర్దార్! – ఉద్యోగ సంఘం రాష్ట్ర నేత మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి

ప్రభుత్వ ఉద్యోగుల జోలికి వస్తే ఖబర్దార్! – ఉద్యోగ సంఘం రాష్ట్ర నేత మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి
IMG-20241004-WA0088

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వికారాబాద్ ఘటన పునావ్రతం కావద్దు అని, వికారాబాద్ కలెక్టర్ పై దాడి హేయమైన చర్య అని, కలెక్టర్ పై దాడిని ఖండిస్తూ టిసిటిఎన్జీవోస్ సంఘం పక్షాన బుధవారం రోజు నిరసన వ్యక్తం చేసినట్లు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పత్రీక్ జైన్, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ లింగ నాయక్ తో పాటు ఇతర అధికారులపై దాడులు చేయటం చాలా బాధాకరమైన విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు ఇక ముందు ఎవరైనా పాల్పడకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ శాఖపై ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు. అన్ని గ్రామీణ, మండలాల, డివిజన్ల, జిల్లా కేంద్రాలలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా కేంద్రాలలో అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న నీతి నిజాయితీతో పని చేస్తున్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్లపై దాడి చేయడం చాలా హీనమైన చర్య అని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి జిల్లా కలెక్టర్ తన పరిధిలో ఉన్న అనేక కార్యక్రమంలో పేద ప్రజల కొరకు రోజువారి సేవలు చేసే ఇలాంటి అధికారులపై గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను కలవడానికి వెళ్లి అక్కడ ఉన్న సమస్య ప్రజలతో కూర్చొని మాట్లాడుతామంటే ఎవరు కొంతమంది స్వార్థపరులు నిజాయితీ పరులైన అధికారులపై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ పత్రిక జైన్ మరియు అదనపు కలెక్టర్ లింగా నాయక్ పై దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని ముజాహిద్ డిమాండ్ చేశారు. దాడి చేస్తున్న వ్యక్తులపై నాన్ బెయిల్ ఏబుల్ వారెంట్ జారీ చేసి వారిని అరెస్టు చేసి జైలుకు పంపించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునర్రావతం కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు. ఇకముందు ఏ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ అని రాష్ట్ర నేత ముజాహిద్ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!