13-11-2024 NORMAL NEWS 03:55 AM
swarnodayam.com
Telugu Daily News
13-11-2024 03:55 AM By Mandala Yadagiri

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ను కలసి కృతజ్ఞతలు తెలిపిన హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్
IMG-20241113-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ అగ్రికల్చర్ నూతన మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా గూడూరి రాజేశ్వరిని నియమించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ప్రణవ్ ను చైర్పర్సన్ గూడూరి రాజేశ్వరి స్వామి రెడ్డి సింగపూర్లో నాయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గమును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విధితమే. హుజూరాబాద్ అగ్రికల్చర్
మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా గూడూరి రాజేశ్వరిని నియమించగా సంబంధిత పత్రాలను బుధవారం రోజు వోడితల ప్రణవ్ చేతులు మీదుగా వారికి అందజేయగా ఆయనకు శాలువా కప్పి పూల బోకే ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడూరు స్వామిరెడ్డి, నేరెళ్ల మహేందర్ గౌడ్, కొలిపాక శంకర్, మేకల తిరుపతి, ఎండి ఇమ్రాన్, కుమార్, సంపత్, కిరణ్ రెడ్డి, బల్లు పున్నం చందర్, దుబాసి బాబు, కిరణ్ కుమార్, వేముల పుష్పలత, కుమారస్వామి, సుగుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!