Social 1080×1350 • Multi-page
13-11-2024 BREAKING NEWS 04:11 AM
swarnodayam.com
Telugu Daily News

ఈనెల 17న మానుకోట లో DMJU ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం.. -డిఎంజేయూ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి

ఈనెల 17న మానుకోట లో DMJU ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం.. -డిఎంజేయూ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి
Oplus_131072

–షరతులు లేకుండా జర్నలిస్టులందరికి అక్రిడేషన్ కార్డ్ ఇవ్వాలి

–డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

–ఈనెల 17న మానుకోట లో DMJU ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం

–డిఎంజేయూ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి

–మానుకోటలో సభ కరపత్రం ఆవిష్కరణ

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, మహబూబాబాద్:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని,అందుకే దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ పోరాట సంఘాన్ని బలోపేతం చేసి జర్నలిస్ట్ హక్కులకై ఉద్యమిస్తామని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ గౌరవాధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో ఈనెల 17న మానుకోటలో తలపెట్టిన డిఎంజేయు ఆవిర్భావ సభ జండా ఆవిష్కరణ కార్యక్రమ పత్రాన్ని యూనియన్ వ్యవస్థాపకులు ఏంపల్లి ముతేష్, జాతీయ నాయకులు సీఎస్ రావు,రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే రాజేంద్రప్రసాద్, బొడ్డు అశోక్ తో కలసి ఆవిష్కరించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ… దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలక ప్రభుత్వాలు మాయమైన అక్రిడేషన్ కార్డు, ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం డిజిటల్ మీడియా యూనియన్ పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. యూనియన్ ఆవిర్భాసభ మానుకోటలో ఈ నెల 17న నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు పోతామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యార సాంబయ్య, యూనియన్ జిల్లా నాయకులు బండారి పవన్,మాదాసు మహేష్ తదితరులున్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!