Social 1080×1350 • Multi-page
13-11-2024 BREAKING NEWS 06:35 AM
swarnodayam.com
Telugu Daily News

నిరుద్యోగ యువతకు ఫ్రీ యాప్..ఉద్యోగ రూపకల్పనలో పెద్దన్న పాత్ర పోషిస్తా! -అదిలాబాద్ జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

నిరుద్యోగ యువతకు ఫ్రీ యాప్..ఉద్యోగ రూపకల్పనలో పెద్దన్న పాత్ర పోషిస్తా!  -అదిలాబాద్ జిల్లా కేంద్రంలో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
Oplus_131072

–ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, (అదిలాబాద్): విస్తృత ప్రచారం అదిలాబాద్ తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ తో ప్రత్యేక యాప్ ను ఉచితంగా అందిస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రంథాలయంలో పలువురు పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగ యువతకు అండగా ఉంటూ ఉద్యోగ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను అమలు చేసే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అల్ఫోర్స్ ఆధ్వర్యంలో VNR e-CLASSES ధ్వారా ఆన్ లైన్ లో వీడియో లెసెన్స్, టెస్ట్ పేపర్లు స్టడీ మెటీరియల్ అందచేయడం జరుగుతుందని, యాప్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో అదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ లో మౌళిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిచినా తరువాత నిరుద్యోగ యువత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రంథాలయాలల్లో ప్రభుత్వం మధ్యాహ్నం ఉచిత భోజనంతో పాటు మహిళలకు, పురుషులకు వేర్వేరు రీడింగ్ రూమ్ లు ఏర్పాటు చేసే విధంగా తన మేనిఫెస్టో పెట్టినట్టు గుర్తు చేశారు. ఓటు నమోదు చేసుకొని వారి కోసం నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకొని రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!