13-11-2024 NORMAL NEWS 07:28 AM
swarnodayam.com
Telugu Daily News
13-11-2024 07:28 AM By Mandala Yadagiri

రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు.?-జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు.?-జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.
IMG-20241113-WA0110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (పెద్దపల్లి) : భారతీయ రైల్వే రైలు ప్రమాదాలకు బాధ్యులు ఎవరని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్దపల్లి పట్టణంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఒరిస్సా రైలు ప్రమాద ఘటన మరువకముందే గూడ్స్ రైలు పట్టాలు తప్పడం బాధాకరమని ఈ ఘటన జరిగిన పరిస్థితుల్లో ఇతర రైళ్ల రాకపోకలు జరిగి ఉంటే ఊహించుకుంటేనే భయాందోళన కలుగుతుందని రైల్వే ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

నష్టం జరిగిన తర్వాత ప్రయాణికుల ప్రాణాలను కాపాడలేకపోయామని రైల్వే అధికారులు విచారం వ్యక్తం చేయడం అర్థరహితమని వాసు వడ్లూరి ప్రయాణికుల పక్షాన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వాసు వడ్లూరి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!