14-11-2024 NORMAL NEWS 12:18 AM
swarnodayam.com
Telugu Daily News
14-11-2024 12:18 AM By Mandala Yadagiri

దినసరి కూలీ కుటుంబానికి కౌన్సిలర్ లావణ్య నరసింహారెడ్డి చేయూత

దినసరి కూలీ కుటుంబానికి కౌన్సిలర్ లావణ్య నరసింహారెడ్డి చేయూత
IMG_20241114_111645

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మామిడి మొగిలి

మొగిలి మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపిన కౌన్సిలర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నవంబర్ 14: హుజురాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన దినసరి కూలి మామిడి మొగిలి (50) ఇటివల అనారోగ్యంతో మృతి చెందగా అతని కుటుంబానికి మున్సిపల్ 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి తన వంతు చేయూతను అందించారు. గత 18 ఏళ్లుగా 26వ వార్డులో నిర్వహించిన అన్ని అభివృద్ధి పనుల్లో మామిడి మొగిలి పాల్గొన్నారు. డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, మరమ్మతులు నిర్వహణ వంటి అభివృద్ధి పనుల్లో మొగిలి బాసటగా నిలిచారని లావణ్య నరసింహారెడ్డి తెలిపారు. మొగిలి మృతి విషాదకరమని మృతికి సంతాపాన్ని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మొగిలిది అత్యంత నిరుపేద కుటుంబమని, పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.5 వేలు, ఒక బియ్యం బ్యాగు, ఇతర వస్తువులు మృతుని భార్య మంగకు అందచేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ధోని పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!