14-11-2024 NORMAL NEWS 09:38 AM
swarnodayam.com
Telugu Daily News
14-11-2024 09:38 AM By Mandala Yadagiri

కాట్రపల్లిలో ఎలుగుబంటి హల్ చల్… మహిళకు గాయాలు.

కాట్రపల్లిలో ఎలుగుబంటి హల్ చల్… మహిళకు గాయాలు.
IMG_20241114_203635

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్14: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. దాని దాడిలో ఓ మహిళకు తీవ్రంగా గాయాల పాలయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం కాట్రపల్లి గ్రామానికి చెందిన గంగాధరి వనమ్మ అనే మహిళ తన మక్క పొలంలో పనులు చేస్తుండగా ఎలుగుబంటి ఒకసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గుర్తించిన స్థానికులు వెంటనే మహిళను హుజురాబాద్ హాస్పిటలకు తరలించారు. గ్రామస్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గ్రామస్తులు ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!