Social 1080×1350 • Multi-page
14-11-2024 BREAKING NEWS 09:52 AM
swarnodayam.com
Telugu Daily News

షాట్ పుట్ లో రాజి కి స్వర్ణ పతకం

షాట్ పుట్ లో రాజి కి స్వర్ణ పతకం
IMG-20241114-WA0091

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
ఇటీవల కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ స్థాయి క్రీడోత్సవాల్లో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఆడబాల రాజీ అనే విద్యార్థినికి షాట్ పుట్ లో స్వర్ణ పతకం సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి తెలిపారు. గురువారం కళాశాలలో స్వర్ణ పథకం సాధించిన రాజీని ఘనంగా సన్మానించారు. బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న రాజీని త్వరలో జరగబోయే జాతీయస్థాయి విశ్వవిద్యాలయ క్రీడల పోటీలకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా సమన్వయకర్త మంగమ్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, అకాడమిక్ సమన్వయకర్త లింగారెడ్డి, సమన్వయకర్త , ఐ క్యు ఏ సి సమన్వయకర్త డాక్టర్ రేణుక, కళాశాల అధ్యాపకులు డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ వి.స్వరూప రాణి, డాక్టర్ సుమలత, డాక్టర్ సరళ ఝాన్సీ రాణి , రమ, పల్లవి,శ్రీధర్ విద్యార్థులు పాల్గొన్నారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!