15-11-2024 NORMAL NEWS 05:47 AM
swarnodayam.com
Telugu Daily News
15-11-2024 05:47 AM By Mandala Yadagiri

నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు సన్మానం

నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు సన్మానం
IMG_20241115_164529

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :

హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గంలో డైరెక్టర్లుగా నియామకమైన వారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ యువజన కాంగ్రెస్ నియోజక వర్గ ప్రదాన కార్యదర్శి మిదిదొడ్ది శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా, పార్టీ కష్టకాలంలో ఉన్న వ్యక్తుల గుర్తించి పార్టీలో తగిన గుర్తింపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబుకి శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని, రైతు పక్షపాతి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను విస్మరించకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఉట్ల రత్నాకర్ రెడ్డి, రాజులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!