15-11-2024 NORMAL NEWS 06:16 AM
swarnodayam.com
Telugu Daily News
15-11-2024 06:16 AM By Mandala Yadagiri

నవంబర్ 29 ,30 తేదీలలో జరిగే సిపిఎం పార్టీ 10 పదవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

నవంబర్ 29 ,30 తేదీలలో జరిగే సిపిఎం పార్టీ 10 పదవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
IMG-20241115-WA0123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నవంబర్ 29, 30 తేదీలలో జరిగే సిపిఎం పార్టీ 10 పదవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.
హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఐఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఏచూరినగర్ లో ఈ నెల 29 ,30 నిర్వహించనున్న పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, ఇప్పటికే సంస్థ గత నిర్మాణంలో భాగంగా, శాఖ మహాసభల నుండి మండల మహాసభలు పూర్తి చేసుకున్నామని, ఈనెల జరిగే జిల్లా మహాసభలలో, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయనున్నట్లు మహాసభలు ఉపయోగపడతాయని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశభక్తి ముసుగులో దేశ సంపదను ప్రకృతి వనరులను, బడా కార్పొరేట్ సంపన్నులకు కట్టబెడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ, కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కొట్లాది మంది ప్రజలపై భారాలు మోపుతుందని అన్నారు.
మరోపక్క దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికి అక్కడ ప్రజల్లోఎండగట్టాలని, దీనికి అడ్డుకట్ట వేయాలని, నల్లధనం వెలికితీత, ఎటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పన, రైతుల ఆదాయాన్ని గుర్తింపు చేస్తామన్న, హామీలన్నీ అటుకె క్కయని, ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే ప్రజా ఆందోళన లు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ హుజరాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్, సైదాపూర్ సిపిఎం మండల కార్యదర్శి గన్డేటి వాసుదేవ్, నాయకులు కదిరి రమేష్, వడ్ల రాజు, ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!