Social 1080×1350 • Multi-page
15-11-2024 BREAKING NEWS 09:36 AM
swarnodayam.com
Telugu Daily News

అయ్యప్ప స్వామి పాటీమీది హనుమాన్ దేవాలయాల్లో పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు

అయ్యప్ప స్వామి పాటీమీది హనుమాన్ దేవాలయాల్లో పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు
IMG-20241115-WA0178

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినంను పురస్కరించుకొని శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని పలు దేవాలయాల్లో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను వేద పండితులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత నవగ్రహ సహిత అయ్యప్పస్వామి దేవాలయం, పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గల పాటిమీది సరస్వతి నవగ్రహ సహిత ఆంజనేయస్వామి దేవాలయం వద్ద, కేసీ క్యాంపులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో, మండలంలోని పెద్ద పాపయ్యపల్లె గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో, సింగపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను వేద పండితులు శాస్త్రోత్కంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రతం విధానం, వ్రతం చేసుకోవడం వల్ల లభించే ప్రయోజనాల గురించి ఉదాహరణలతో కతలతో భక్తులకు వేద పండితులు వివరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గూడ జగదీశ్వర శర్మ, తిరుమలేష్, నందకిషోరాచార్యులు, కిరణ్ కుమార్, ప్రదీప్, శ్రీధర్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. వ్రతం అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!