Social 1080×1350 • Multi-page
16-11-2024 BREAKING NEWS 04:36 AM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ ఇండియా తెలంగాణ బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అందే వెంకటేశ్వరరావు నియామకం

ఆల్ ఇండియా తెలంగాణ బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అందే వెంకటేశ్వరరావు నియామకం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆల్ ఇండియా తెలంగాణ బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హుజురాబాద్ పట్టణము షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రముఖ న్యాయవాది అందే వెంకటేశ్వరరావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఆల్ ఇండియా బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ సంక్షేమ సంఘం, శాశ్వత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొత్త విజయ భాస్కర్ నియామక పత్రాలు అందజేశారు. జ్యోతిరావు పూలే ఆశయాలు, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలు, కొమరం భీమ్ ఆశయాలు మరియు డా॥ అబ్దుల్ కలాం ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీలకు సేవ చేస్తారని భావిస్తూ వెంకటేశ్వరరావును నియమించినట్లు ఆల్ ఇండియా తెలంగాణ బి.సి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ భాస్కర్ పేర్కొన్నారు. కాగా వెంకటేశ్వరరావు నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!