Social 1080×1350 • Multi-page
17-11-2024 BREAKING NEWS 11:58 AM
swarnodayam.com
Telugu Daily News

సినీ నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్

సినీ నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్
IMG-20241117-WA0121

స్వర్ణోదయం ప్రతినిధి చెన్నై, నవంబర్ 17: తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి కోర్టు రిమాండ్‌ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల29 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

నవంబర్ 3న చెన్నైలోని బ్రాహ్మణ సమాజసమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. తమిళనాడులో ఉంటున్న తెలుగు ప్రజలు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల భార్యలకు సేవలు చేయడానికి వచ్చారని.. కానీ ఇప్పుడు ఆ తెలుగోళ్లే తమిళ వాళ్లమని చెప్పుకుంటూ చలామణీ అవుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పెను దుమారం రేపాయి. తమిళనాడులో చాలా చోట్ల నటి కస్తూరిపై తెలుగువారు ఫిర్యాదులు చేయడంతో చెన్నై నుండి వచ్చిన ప్రత్యేక పోలీసులు హైదరాబాదులో నిన్న అరెస్టు చేసింది విధితమే.!

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!