18-11-2024 NORMAL NEWS 07:58 AM
swarnodayam.com
Telugu Daily News
18-11-2024 07:58 AM By Mandala Yadagiri

సీఎం కార్యక్రమం దృష్ట్యా దళితుల ముందస్తు అరెస్టులు

సీఎం కార్యక్రమం దృష్ట్యా దళితుల ముందస్తు అరెస్టులు
IMG-20241118-WA0073

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి సభను దృష్టిలో పెట్టుకొని హుజురాబాద్ నియోజకవర్గం లోని పలువురు దళితులను పోలీసులు ముందస్తుగా అదుపులో తీసుకున్నారు. దళిత బంధు రెండో విడత నిధుల విడుదల కోసం ఇటీవల హుజురాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో జరిగిన విషయం విధితమే. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గాయాలు కావడం పలువురు దళితుల కు గాయాలు కావడంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందారు. హుజురాబాద్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి దారితీసింది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పు చేసింది అనే భావన దళితుల్లో ఏర్పడింది. కాగా సీఎం రేవంత్ రెడ్డి సభ మంగళవారం ఉండడంతో దళితులు ఏమైనా అలజడి చేస్తారని ఉద్దేశంతో ముందస్తుగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈరోజు దళిత సాధన సమితి లబ్ధిదారులను సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు కరీంనగర్ వస్తున్న సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారిలో కొలువురు సురేష్, మంద రాజేష్, బండారు ప్రశాంత్, కొలిపాక రక్షిత్, ఆరేపల్లి సంపత్, పాతకాల సురేష్, పాతకాల రమేష్, అక్కినపల్లి ప్రవీణ్, అంబాల సుధాకర్, తదితరులను అరెస్టు చేయడం జరిగింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!