Social 1080×1350 • Multi-page
19-11-2024 BREAKING NEWS 06:27 AM
swarnodayam.com
Telugu Daily News

దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతి…-నేటి యువత ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగాతీసుకోవాలి.

దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతి…-నేటి యువత ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగాతీసుకోవాలి.
IMG_20241119_172521

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు
స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జయంతి వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..
ఇందిరాగాంధీ ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలని, గరిబి హటావో, బ్యాంకుల జాతీకరణ, అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళాగా పరిపాలన దక్షతగా ఇందిరాగాంధీ పాలించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే తనకంటూ ఒక గుర్తింపు తీసుకొని వచ్చారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల, పట్టణ కాంగ్రెస్, నాయకులు, మహిళ
నాయకురాల్లు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

Oplus_131072 ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు.
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!