Social 1080×1350 • Multi-page
20-11-2024 BREAKING NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News

బాలల హక్కుల చట్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలి..ప్రముఖ సామాజికవేత్త బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్

బాలల హక్కుల చట్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలి..ప్రముఖ సామాజికవేత్త బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్
IMG-20241120-WA0213

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బాలల హక్కుల చట్టాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని ప్రముఖ సామాజికవేత్త బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో ప్రముఖ సామాజికవేత్త బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… బాల కార్మిక చట్టాలు బాలల హక్కుల చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని ఆయన కోరారు. పిల్లలు వారి భావాలను బాలల హక్కుల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దామని పేర్కొన్నారు చిన్నారి బాలలకు సమాచారాన్ని పంచుకోడాన్ని పరస్పర అవగాహన పెంచుకోవడానికి ప్రోత్సహించేందుకు అందరం కృషి చేద్దామని ఆయన అన్నారు. నేటి బాలులే రేపటి బావి భారత పౌరులని ఆయన పేర్కొన్నారు. బాలల చే ఎవరైనా పని చేపించినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం అందించాలని ఆయన కోరారు. చిన్నారి బాలల వారి హక్కులను కాల రాయకూడదని అన్నారు. వారికోసం స్వచ్ఛమైన వాతావరణంలో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. చిన్నారి బాలబాలికలను తల్లిదండ్రులు విద్య అందించేందుకు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. మా బాలల హక్కుల ప్రజావేదిక గత రెండు దశాబ్దాలుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాల నిర్మూలన బాలల హక్కుల కోసం నిరంతరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. చిన్నారి బాలబాలికలు భవిష్యత్ తరాలకు ఆదర్శం నిలిచేందుకు శ్రమించాలని అన్నారు. చిన్నారి బాలబాలికలు చిన్ననాటి నుండి పట్టుదల విద్య పైన దృష్టి పెట్టి విజ్ఞానాన్ని పెంచుకోవాలని మహనీయుల పుస్తక పఠన చేయాలని ఆయన కోరారు. చిన్నారులు తల్లిదండ్రుల కోసం కలం నిజం చేసేందుకు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిరంతరంగా శ్రమించాలని ఆయన పేర్కొన్నారు. నవంబర్ మాసం అంటేనే బాలలకు పండుగ రోజే లే చిన్నారి బాలబాలికలతో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం వేడుకలు సామాజికవేత్త బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి చిన్నారులతో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల ప్రజా వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బైరి చంద్రశేఖర్, చిన్నారి బాలబాలికలు నల్ల హర్షవర్ధన్, నక్షత్ర, ఏ అక్రనందన్, ఎస్ వరుణ్ తేజ, వి కార్తీక, శివశంకర్, జి శశాంక్, ఎస్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!