Social 1080×1350 • Multi-page
20-11-2024 BREAKING NEWS 09:14 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు దుర్మరణం!

ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు దుర్మరణం!
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రమాదవశాత్తు వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన బుధవారం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లిలో గ్రాగ్రామంలోషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బోర్నపల్లి గ్రామానికి చెందిన నక్క కుమార్ తల్లి నక్క సరోజన (58) ఆదివారం బయటికని వెళ్ళి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా బోర్నపల్లి గ్రామ శివారులోని చెరువులో శవమై కనిపించింది. కాగా ఆమె చెరువులో ఏదైనా పని ఉండి వెళ్లి ఉంటుందని, ప్రమాదవశాత్తు ఆమె చెరువులో పడి మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. సరోజన మృతి చెందిన విషయమై ఆమె కుమారుడు నక్క కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సరోజన ఆకస్మిక మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!